రాధా గాయత్రి కేసు: దర్యాప్తు అధికారిగా DSP జేసీ పంత్ నియామకం
ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరోసారి దర్యాప్తు అధికారిని మార్చింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన SP సంపూర్ణానంద్ గైరోలా స్థానంలో DSP జేసీ పంత్‌ను కొత్తగా నియమించినట్లు తెలిసింది.
విశాఖ నుంచి ముసోరికి చేరుకున్న గాయత్రి తల్లిదండ్రులు, పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు ఈ మార్పు గురించి తెలిసిందని చెప్పారు. SSP కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి వారిని కొత్త దర్యాప్తు అధికారి DSP పంత్‌ను కలవాలని సూచించినట్లు వారు తెలిపారు.
అనంతరం, రాధా గాయత్రి మృతదేహాన్ని ఉంచిన మార్చురి వద్దకు చేరుకున్న కుటుంబం భావోద్వేగానికి గురైంది. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ముసోరిని వదిలి వెళ్లబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
ఈ విషయంపై AP TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా కృషి చేస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com