తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాలకు వర్ష హెచ్చరిక
వాతావరణ శాఖ అధికారులు ఇవాళ నుంచి తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని చెప్పారు.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనుమకొండ జిల్లాలకు కూడా రైన్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల నాట్లు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జలాలు తగ్గడంతో నీటి సమస్య తలెత్తింది. ప్రస్తుతం వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com