హైదరాబాద్ 28°C
అమరావతి 31°C
IST 6:46 PM
ఆదివారం జూలై 19 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు
📷 Amit Mehra / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏపీలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. 10 పడకలను అందుబాటులో ఉంచారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ పీవీ సత్యనారాయణ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోవిడ్ కేసులు నమోదు కాలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రతిరోజూ 10 నుంచి 15 వైరల్ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు.

కోవిడ్ లక్షణాలపై డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, తీవ్రమైన జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో లేదా కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఇటువంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఐసోలేషన్ చేసి టెస్ట్ చేయించాలన్నారు.

అనుమానిత కోవిడ్ రోగులకు వెంటనే చికిత్స ప్రారంభిస్తామని, టెస్ట్ ఫలితాల తర్వాత నిర్దిష్ట చికిత్స అందిస్తామని డాక్టర్ సత్యనారాయణ వివరించారు. ఆసుపత్రిలో ఫిజీషియన్లు, పల్మాలజిస్టులు అందుబాటులో ఉన్నారని, అవసరమైతే మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు జిల్లా వైద్యశాఖ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. కోవిడ్ నిర్ధారణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com