రామ్ చరణ్–సుకుమార్ సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్; నాలుగు భారీ సెట్లు
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ప్రాథమికంగా రూ.400 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్టు సమాచారం.
కథ ప్రకారం ఈ సినిమాకు నాలుగు భారీ సెట్లు అవసరం. అలాగే భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కావాలి. దీంతో బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని గ్రాఫిక్స్, సెట్లకే కేటాయిస్తున్నారని తెలుస్తోంది.
పెద్ద సినిమాలకు ప్రారంభంలో అనుకున్న బడ్జెట్‌కు, విడుదల సమయంలో అయ్యే ఖర్చుకు మధ్య 20 నుంచి 30 శాతం వ్యత్యాసం ఉంటుందని ఫిల్మ్ అనలిస్టులు చెప్తున్నారు. ఆ లెక్కన ఈ సినిమా విడుదల నాటికి బడ్జెట్ రూ.500 కోట్లకు చేరుకోవచ్చని వారు అంటున్నారు.
మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సెట్లు, గ్రాఫిక్స్ తర్వాత నటీనటులు, దర్శకుడి రెమ్యునరేషన్ కూడా బడ్జెట్లో పెద్ద భాగమని సినిమా వర్గాల సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com