ఆషాఢ మాసంలో శివారాధన: రుద్రాక్ష ధారణ ప్రాముఖ్యత ఏమిటి?
హిందూ ధార్మిక సంప్రదాయంలో ఆషాఢ మాసం శివకుటుంబానికి ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ నెలలో అమ్మవారిని పార్వతీ దేవిని, సంకటహర చతుర్థి నాడు గణపతిని, ఆడి కృత్తిక / సుబ్రహ్మణ్య షష్టి రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. నెల చివర వచ్చే మాస శివరాత్రితో శివారాధన ముగుస్తుంది.
శివారాధనలో ఐదు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి: రుద్రాక్ష ధారణ, భస్మ ధారణ, మౌన వ్రతం, అభిషేక సేవ, మారేడు దళాన్ని స్వామికి అర్పించడం.
వీటిలో రుద్రాక్ష ధారణకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతారు. రుద్రాక్ష మాలను మెడలో ధరించడం, చేతికి కడియంలా అలంకరించుకోవడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్షను శివుడి ప్రతీకగా భావిస్తారు.
అసలీ రుద్రాక్ష నిజమైనదో కాదో తెలుసుకోవడానికి ఒక సాధారణ ప్రయోగం ఉంది. బోర్లించిన రాగి పళ్లెం మీద రుద్రాక్ష ఉంచి, పైన మరో రాగి పళ్లెం అతి దగ్గరగా తాకకుండా తీసుకువెళ్లి వృత్తాకారంగా తిప్పితే, రుద్రాక్ష కదలడం మొదలవుతుంది. నిజమైన రుద్రాక్షకు రాగి లోహాన్ని కదిలించే శక్తి ఉంటుంది. ఈ కారణంగానే దేవతారాధనలో రాగి పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణం వాడటం ఆనవాయితీగా వస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com