సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్స్‌కు రిమాండ్
విజయవాడ సాయి కృష్ణ లాక్ అప్ డెత్ కేసులో నిందితులైన హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. జూలై 14 వరకు రిమాండ్ విధిస్తూ అశోక్‌ను మచిలీపట్నం, నానిని ఏలూరు జైలులకు తరలించాలని ఆదేశించింది.
వీరు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందినవారు. సౌత్ ఏసీపీ కార్యాలయంలో లొంగిపోగా, సిట్ అధికారులు వారిని తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
సిట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, ఈ కేసులో మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బాబూరావు (A5), సాంబయ్య (A6)లను నిందితులుగా చేర్చారు. రిమాండ్ రిపోర్టులో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో హెడ్ కానిస్టేబుల్స్ చాలా ప్రశ్నలకు మౌనం వహించారు. తమకేం తెలియదన్నారు. మొబైల్ ఫోన్లను నాగాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మేసినట్లు తెలిపారు.
సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం, హత్య చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో అశోక్, నాని కీలకంగా వ్యవహరించినట్టు సిట్ ఆరోపించింది. ముందస్తు ప్రణాళికతో సాక్ష్యాలను మాయం చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com