సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు: సిఐ నాగరాజు బెయిల్ పిటిషన్ దాఖలు
విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏ1 నిందితుడు సిఐ నాగరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన ఈ పిటిషన్ వేశారు. 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు కానిస్టేబుల్స్ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. నాగరాజును ఏడు రోజుల పాటు SIT అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన ఎలాంటి వివరాలూ ఇవ్వలేదని తెలిసింది. ఆయనను మళ్లీ కస్టడీకి తీసుకునే ఆలోచనలో SIT అధికారులు ఉన్నారు.
నాగరాజు బెయిల్ పిటిషన్‌పై రేపు లేదా ఎల్లుండు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com