హైదరాబాద్ 32°C
అమరావతి 36°C
IST 3:04 PM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభం, క్యాన్సర్ సేవల విస్తరణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభం, క్యాన్సర్ సేవల విస్తరణ
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

సంగారెడ్డి జిల్లాలో వైద్య సేవలను విస్తరించేందుకు శుక్రవారం ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డిలో క్యాన్సర్ వైద్య సేవలను విస్తృతం చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి చికిత్స కోసమైనా జిల్లా ప్రజలు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికే రావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

వచ్చే వర్షాకాలం నాటికి సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా మారనుంది. 200 కోట్లకు పైగా వ్యయంతో కొత్త భవన నిర్మాణం జరుగుతోంది. పీజీ కోర్సులు ప్రారంభించడం, విభాగాలను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

100 బెడ్ల ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యుల నియామకం ద్వారా స్థానికంగానే మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సదుపాయాలు కల్పిస్తే ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, అందుకు ప్రభుత్వం కట్టుబడిందని అన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com