తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నారు
తెలంగాణ నూతన సీఎస్‌గా నియమితులైన సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయానికి చేరుకున్నారు. మాజీ సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఒకే వాహనంలో వచ్చారు.
ఆయనకు సచివాలయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది స్వాగతం పలికారు. అంతకుముందు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో జరుగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
1992 బ్యాచ్ ఐఏఎస్ అయిన సంజయ్ జాజు ఇటీవల వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు నాలుగు రోజుల క్రితం కేంద్ర సర్వీసులు వదిలి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
సంజయ్ జాజు సచివాలయంలోని ఆరో అంతస్తులోని సీఎస్ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com