హైదరాబాద్ 32°C
అమరావతి 36°C
IST 2:12 PM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు పోలీసుల ఏర్పాట్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు పోలీసుల ఏర్పాట్లు
📷 vipin kumar / Pexels
షేర్ కాపీ అయింది ✓

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్ట్ 2, 3 తేదీల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్ట్ 2న ప్రధాన ఉత్సవం ఉంటుంది. అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఆగస్ట్ 3న రంగం, అంబారి సవారీ కార్యక్రమాలు జరుగుతాయి.

డిసిపి రక్షితా మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. విఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలగదని హామీ ఇచ్చారు.

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. గత ఏడాది అదనంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశామని, ఈ సారి రెండు బోనాల లైన్లు, నాలుగు ఎంట్రీ లైన్లు ఉంటాయని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది ఎదురైన సమస్యలను కూడా సమీక్షించి పరిష్కారం చూపామని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com