హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:52 AM
శనివారం జూలై 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

సిరిసిల్ల నేతన్నలకు రూ.236 కోట్లు క్రెడిట్, మరో రూ.40 కోట్లు పెండింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సిరిసిల్ల నేతన్నలకు రూ.236 కోట్లు క్రెడిట్, మరో రూ.40 కోట్లు పెండింగ్
📷 prasun_16 . / Pexels
షేర్ కాపీ అయింది ✓

సిరిసిల్లలో నేత కార్మికుల ఖాతాలకు రూ.236 కోట్లు జమ అయ్యాయి. ఇంకా రూ.40 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇందిరమ్మ చీరల ఆర్డర్‌లపై వస్తున్న చెల్లింపులివి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు 60 లక్షలు, పట్టణాలకు 35 లక్షలు, గోషి చీరలకు 5 లక్షల చొప్పున ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్లతో నెలకు ఒక్కొక్క నేత కార్మికుడి సంపాదన రూ.20-25 వేల మధ్య ఉంటోంది.

గతంలో BRS ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు చాలా తక్కువగా ఉండేవి. బిల్లులు కూడా సకాలంలో చెల్లించేవారు కాదు. దీంతో నేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డర్ల పెరుగుదలతో నేతన్నలకు ఉపశమనం లభించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com