దేశ ప్రజలకు సోనం వాంగ్చుక్ లేఖ: రెండో స్వాతంత్ర్య పోరాటం అవసరం
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. ఆయన చేతిరాతతో రాసిన లేఖను భార్య గీతాంజలి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ లేఖలో దేశంలో రెండో స్వాతంత్ర్య పోరాటం అవసరమని పేర్కొన్నారు. అన్యాయం నుంచి స్వేచ్ఛ కోసం పోరాటం కొనసాగించాలని కోరారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన BP, పల్స్ రేట్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. అయితే దీర్ఘకాలిక నిరాహార దీక్ష వల్ల బ్లడ్ పారామీటర్లలో స్వల్ప మార్పులు వచ్చినట్టు పేర్కొన్నారు.
వాంగ్చుక్‌ను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరుతూ గీతాంజలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆమె అభ్యర్థించారు. ఆసుపత్రి బయట భారీగా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా, SJEP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన దీక్ష రెండో రోజు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com