హైదరాబాద్ 23°C
అమరావతి 31°C
IST 8:33 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల వరుణ యాగాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల వరుణ యాగాలు
📷 VARAN NM / Pexels
షేర్ కాపీ అయింది ✓

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక వరుణ యాగాలు నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగాలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా ఘాటు, పాత యాగశాలను వేదికగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరుణుడు, ఋష్య శృంగుడు, నవగ్రహాలు, అష్ట దిక్పాలకులకు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి.

15వ తేదీన పాత యాగశాలలో రుద్ర హోమం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. 16న ఉదయం కృష్ణా నది నుంచి పవిత్ర జలాలు సేకరించి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఘటాభిషేకం చేస్తారు. అదే రోజు ఉదయం 10:30 గంటలకు మహా పూర్ణాహుతితో యాగాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com