తిరుమలలో శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి సహస్ర కలశాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని ప్రతిష్టించిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.
శ్రీవారి మూలమూర్తికి ముందు కౌతుక మూర్తి శ్రీ మనవాళ్ళ పెరుమాళ్లను, విశ్వక్సేనులను ఎదురుగా ఉంచారు. ఆ తర్వాత మూలమూర్తిని భోగ శ్రీనివాస మూర్తికి దారంతో అనుసంధానం చేశారు. వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com