ఇరాన్‌పై దాడికి అమెరికా సన్నద్ధం? ట్రంప్ అత్యవసర సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వైట్ హౌస్‌లో జాతీయ భద్రతా సలహాదారులతో, సైనిక అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. CBS, Axios నివేదికల ప్రకారం ఈ సమావేశంలో Vice President జేడి వాన్స్, Defense Secretary పీట్ హెగ్సేత్, CIA Director జాన్ రాట్‌క్లిఫ్, Chief of Staff సూజి వైల్స్ పాల్గొన్నారు.
పరిస్థితి తీవ్రతను సూచిస్తూ ట్రంప్ న్యూ జెర్సీలోని గోల్ఫ్ క్లబ్ ప్రోగ్రాంను రద్దు చేసుకున్నారు. కుమారుడి వివాహ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా వైట్ హౌస్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుత పరిస్థితిలో వైట్ హౌస్‌లో ఉండటం అవసరమని ట్రంప్ తన Truth Social పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇరాన్ అణు ఆయుధాల తయారీని అడ్డుకోవడానికి వేరే ఆప్షన్ లేదని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. Pentagon విదేశాల్లో ఉన్న సైనికుల Memorial Day సెలవులను రద్దు చేసి, అత్యవసర విధులకు హాజరయ్యే సైనికుల జాబితాను అప్‌డేట్ చేసింది.
ట్రంప్ సన్నిహిత సలహాదారు డాన్ స్కావినో B-2 stealth bomber విమానాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో అలాంటి వీడియో పోస్ట్ చేసిన మరుసటి రోజే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన నేపథ్యంలో ఈ పోస్ట్ చర్చకు దారితీసింది.
ఇస్లామాబాద్ నుండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అత్యవసరంగా టెహరాన్ చేరుకొని ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. కతార్ కూడా మధ్యవర్తిత్వంలో పాల్గొంటోంది. అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. చర్చలు విఫలమైతే మిడిల్ ఈస్ట్‌లో దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com