హైదరాబాద్ 27°C
అమరావతి 32°C
IST 5:20 PM
మంగళవారం ఆగస్టు 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఉండవల్లిలో CRDA భూసేకరణకు రైతుల నిరసన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఉండవల్లిలో CRDA భూసేకరణకు రైతుల నిరసన
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో CRDA సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు.

దీనిపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పొలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com