హైదరాబాద్ 27°C
అమరావతి 36°C
IST 2:07 PM
మంగళవారం జూలై 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

సెకండ్ హ్యాండ్ లాప్టాప్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు – నిపుణుల హెచ్చరికలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సెకండ్ హ్యాండ్ లాప్టాప్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు – నిపుణుల హెచ్చరికలు
📷 MOHI SYED / Pexels
షేర్ కాపీ అయింది ✓

కొత్త లాప్టాప్ల ధరలు రూ.60,000 నుండి రూ.1.5 లక్షల వరకు ఉండటంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ లాప్టాప్లను కొనుగోలు చేస్తున్నారు. రూ.15,000 నుండి రూ.30,000 మధ్య లభ్యమవుతున్న ఈ లాప్టాప్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్ కంప్యూటర్ మార్కెట్ దేశంలో చెన్నై తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ అని వ్యాపారులు చెప్తున్నారు. ఇక్కడి ఓ సెకండ్ హ్యాండ్ లాప్టాప్ విక్రేత వన్ ఇయర్ వారంటీతో, క్వాలిటీ చెక్లతో లాప్టాప్లను విక్రయిస్తున్నామని తెలిపారు.

కానీ ధర తక్కువ అని కొనుగోలు చేస్తే తర్వాత వేల రూపాయల రిపేర్లు ఖర్చు అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనే ముందు స్క్రీన్పై గీతలు, డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా చూడాలి. కీబోర్డ్, టచ్ప్యాడ్, స్పీకర్లు, వెబ్కామ్, USB పోర్ట్లు, బ్యాటరీ బ్యాకప్ అన్నీ పరీక్షించుకోవాలని సూచించారు.

సైబర్ నిపుణులు మాట్లాడుతూ, కొందరు హిడెన్ మాల్వేర్, స్పైవేర్లను ఇన్స్టాల్ చేసి లాప్టాప్లను విక్రయించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి లాప్టాప్ల ద్వారా బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, పాస్వర్డ్లు, ఇమెయిల్స్ దొంగలించే ప్రమాదం ఉంది. వెబ్కామ్ను హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు.

లాప్టాప్ కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నమ్మకమైన వ్యక్తి నుండే కొనాలని నిపుణులు చెబుతున్నారు. దొంగిలించిన లాప్టాప్ అయితే, ఇంటర్నెట్కు కనెక్ట్ చేయగానే పోలీసులకు సమాచారం వెళ్తుంది. దీనివల్ల కేసు నమోదయ్యే అవకాశం ఉంది.

కొనుగోలు చేసిన వెంటనే లాప్టాప్ను పూర్తిగా ఫార్మాట్ చేసి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, యాంటీవైరస్తో స్కాన్ చేయించాలని, నమ్మకమైన టెక్నీషియన్తో హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com