హైదరాబాద్ 29°C
అమరావతి 35°C
IST 4:05 PM
గురువారం ఆగస్టు 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

వెరికోస్ వెయిన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స – డాక్టర్ సందీప్ వివరణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వెరికోస్ వెయిన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స – డాక్టర్ సందీప్ వివరణ
📷 Mikhail Nilov / Pexels
షేర్ కాపీ అయింది ✓

వెరికోస్ వెయిన్స్ సమస్య ఇటీవల యువతలో కూడా కనిపిస్తోందని జనరల్ సర్జన్ డాక్టర్ సందీప్ తెలిపారు. గతంలో వయసు పెరిగిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చిన్న వయసులోనే వెరికోస్ వెయిన్స్ బాధపడుతున్నారు.

రక్తనాళాలు ఉబ్బడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువసేపు నిలబడటం, కూర్చోవడం, ఊబకాయం, హార్మోన్ల మార్పులు, గర్భధారణ వంటి కారణాల వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో రక్త ప్రసరణ ఒత్తిడి పెరగడం వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

లక్షణాల విషయానికొస్తే, మొదట అరికాళ్ల దగ్గర నల్ల మచ్చలు ఏర్పడతాయి. దీన్ని మాల్యులర్ ఫ్లేయర్ అంటారు. తర్వాత రక్తనాళాలు ఉబ్బుతాయి. నిర్లక్ష్యం చేస్తే రక్తం నిలవ ఉండడం వల్ల చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు త్వరగా మానవు. సక్రమ చికిత్స చేయించుకుంటేనే నయమవుతాయి.

ప్రాథమిక దశలో వ్యాయామం చేయడం, కాళ్లకు కదలిక ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం వల్ల కాళ్లకు ఒత్తిడి ఇచ్చి రక్తం గుండెకు తిరిగి వెళ్లేందుకు సహాయపడుతుంది. జంక్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండటం, శరీర బరువు తగ్గించుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా నివారించవచ్చు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com