శ్రీశైలంలో వరుణ యాగ సహిత సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం నాలుగో రోజు ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు ఏకాదశ రుద్ర అభిషేకం, మహాన్యాస పారాయణం, రుద్ర పారాయణం, చండీ పారాయణం తదితర ప్రత్యేక పూజలు చేశారు. పాతాళగంగ, కృష్ణవేణి నదీ జలాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com