నెల్లూరులో రొట్టెల పండుగలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు
నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ మహోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నుంచి రొట్టెలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర నాయకులకు అల్లా ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా నాయకుల సహకారంతో ఈ ఉత్సవాన్ని సక్రమంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com