వేతనాలు రాక ఒకేషనల్ ట్రైనర్ల నిరసన: హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి
వేతనాలు రాకపోవడంతో ఒకేషనల్ ట్రైనర్లు హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 10 నుంచి 12 నెలలుగా జీతాలు రావడం లేదని వారు చెప్తున్నారు. తమ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు, జెడ్పీ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దాదాపు 1,900 మంది ఒకేషనల్ ట్రైనర్లు పని చేస్తున్నారు. వీరిలో సుమారు 1,400 మందికి 12 నెలలుగా వేతనాలు అందలేదని ట్రైనర్లు తెలిపారు.
ప్రతి నెలా ఒకటో తేదీనే జీతం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒకేషనల్ ట్రైనర్లకు 12 నెలల వేతన విధానం అమలులో ఉందని, తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. casual leave 12 నుంచి 15-16 రోజులకు పెంచాలని, మహిళా ట్రైనర్లకు పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
వేతనాలు ఏజెన్సీల ద్వారా వస్తాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఏజెన్సీలు చెప్తున్నాయని ట్రైనర్లు తెలిపారు. ఫైల్ ఫైనాన్స్ విభాగంలో ఉందని, సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర ఉందని అధికారులు చెప్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై అధికారుల స్పందన లభ్యం కాలేదు.
గతంలో కమిషనర్, SPD, JD అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ట్రైనర్లు చెప్తున్నారు. వేతనాలు విడుదలయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, తదుపరి దశలో సెక్రటేరియట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com