పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు: హుగ్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం
దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా, ఒడిస్సా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లలో వరదల పరిస్థితి ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. స్థానికులు మాట్లాడుతూ ఇళ్లలోకి వరద నీరు చేరిందని, గత రెండు రోజులుగా నీటిలోనే ఉన్నామని వాపోయారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హర్యానాలోని గురుగ్రాం సమీపంలోని జాజర్లో భారీ వర్షాలు కురవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒడిస్సాలోని పూరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com