మెదక్‌లో 2K రన్: రేపటి నుంచి ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం
మెదక్ జిల్లాలో రేపటి నుంచి ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఓటర్లందరూ భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రామదాస్ చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అదినపు SP విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2002లో నిర్వహించిన SIR తో మ్యాపింగ్ చేసి ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితాకు ట్యాగింగ్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. BLO లు రేపటి నుంచి ప్రతి ఇంటికి వచ్చి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని వివరించారు. BLO అంటే స్థానిక అంగన్‌వాడీ టీచర్ గానీ, పంచాయతీ సెక్రెటరీ గానీ, మున్సిపాలిటీలో RP లు గానీ అయి ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ SIR కార్యక్రమం సాధారణ ఓటర్ జాబితా సవరణ కంటే భిన్నంగా ఉంటుందని, పాత SIR జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలను వెరిఫై చేస్తారని అధికారులు వివరించారు. BLO లు రెండోసారి ఇంటికి వచ్చినప్పుడు నింపిన ఎన్యుమరేషన్ ఫారాన్ని స్వీకరించి, రిసీవింగ్ రాసిన ఒక కాపీ ఓటర్‌కు అందజేస్తారు. మరొక కాపీని AERO కి సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, BLO లు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com