ఆంధ్రప్రదేశ్

శేషాచలం అడవుల్లో 477 ఏళ్ల నాటి విజయనగర శాసనాలు లభ్యం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శేషాచలం అడవుల్లో 477 ఏళ్ల నాటి విజయనగర శాసనాలు లభ్యం
📷 Akhil Dasari / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం అటవి ప్రాంతంలో పురాతన శాసనాలు లభ్యమయ్యాయి. శేషాచలం లోని సదాశివకోన ప్రాంతంలో ఈ శాసనాలు గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు.

ఈ శాసనాలు 477 సంవత్సరాల క్రితం విజయనగరాన్ని పాలించిన సదాశివ దేవరాయలు చేయించినవిగా గుర్తించారు. శైవమతానికి సంబంధించిన ఈ శాసనాలు తెలుగు, కన్నడ, తమిళ మూడు భాషల్లోనూ రాయబడ్డాయి. అప్పట్లో మూడు ప్రాంతాల శైవ భక్తులు ఇక్కడికి వచ్చేవారు కాబట్టి, వారికి అర్థం అయ్యేలా మూడు భాషల్లోనూ శాసనాలు వేయించినట్లు అధికారులు భావిస్తున్నారు.

గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామికి నైవేద్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం భూములు దానం చేసిన విషయాలు ఈ శాసనాల్లో ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు ఈ శాసనాలను సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తులో పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరింత పరిశోధన కూడా చేపడతామని వెల్లడించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com