హైదరాబాద్ జలమండలి GM ఇంట్లో ACB సోదాలు — ₹100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్ జలమండలి GM అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లాపూర్‌లోని ఆయన ఇంట్లో ఉదయం మొదలైన సోదాలు దాదాపు 12 గంటలు కొనసాగాయి. DSP నేతృత్వంలో తొమ్మిది ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించినట్లు ACB అధికారికంగా తెలిపింది.
ఇంట్లో ₹1 కోటికి పైగా నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 9 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు కూడా సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు కూడా గుర్తించారు.
హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, మరో 6 open ఫ్లాట్లు, ఒక ఇల్లు గుర్తించారు. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు documents స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ₹100 కోట్లకు పైగా ఉన్నట్లు ACB పేర్కొంది.
భార్య పేరుతో పాటు ఇతర వ్యక్తుల పేర్ల మీద కూడా కొన్ని ఆస్తి పత్రాలు ఉన్నట్లు తెలిసింది. ఇవి బినామీ పేర్ల మీద ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. సోదాలు పూర్తయిన తర్వాత అనంత లక్ష్మీ కుమార్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com