హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 6:48 PM
బుధవారం జూలై 15 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

భార్యకు 25% భరణం తప్పనిసరి కాదు: అలహాబాద్ హైకోర్టు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భార్యకు 25% భరణం తప్పనిసరి కాదు: అలహాబాద్ హైకోర్టు
📷 KATRIN BOLOVTSOVA / Pexels
షేర్ కాపీ అయింది ✓

భార్యకు భర్త నికర జీతంలో 25% భరణంగా ఇవ్వడం తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం మార్గదర్శకం మాత్రమేనని, కోర్టు విచక్షణపై నిర్ణయం ఆధారపడుతుందని తెలిపింది.

కాన్పూర్‌కు చెందిన జయప్రకాశ్‌, పింకీ అలియాస్ ప్రీతి దంపతుల మధ్య వివాదంలో ఈ తీర్పు వెలువడింది. భార్య పింకీ భరణం కోరుతూ వేసిన పిటిషన్‌పై కాన్పూర్ ఫ్యామిలీ కోర్టు భర్త నెలకు రూ.12,000 ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం భర్త విడాకులు కోరగా, కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భరణం మొత్తాన్ని పెంచాలని భార్య, దాన్ని వ్యతిరేకిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న హైకోర్టు, విడాకుల తర్వాత కూడా భార్య తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే భరణం ఇవ్వాల్సిందేనని తేల్చింది. ప్రీతికి సరైన ఆదాయం లేదని, భర్తకు సరిపడా ఆదాయ మార్గాలు ఉన్నాయని గుర్తించింది. భర్త నికర జీతం రూ.67,430 నుంచి నెలకు రూ.20,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com