AP TET 2026 షెడ్యూల్ విడుదల: నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు
ఏపీ ప్రభుత్వం AP TET 2026 షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
నేటి నుండి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జులై 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. జులై 25 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షలు ఆగస్టు 5 నుండి 21 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ ఉంటుంది.
ఆగస్టు 24న ప్రాథమిక కీ, సెప్టెంబర్ 8న తుది కీ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలు వెల్లడిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com