హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 11:31 AM
సోమవారం ఆగస్టు 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఋషికొండ భవనాల లీజుకు ఈఓఐ ఆహ్వానించిన ఏపీ పర్యాటక శాఖ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఋషికొండ భవనాల లీజుకు ఈఓఐ ఆహ్వానించిన ఏపీ పర్యాటక శాఖ
📷 Luca Severin / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏపీ పర్యాటక శాఖ విశాఖ ఋషికొండలోని భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపాదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలు (ఈఓఐ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం సుమారు 450 కోట్ల రూపాయలతో ఇక్కడ టూరిజం భవనాలు నిర్మించింది. దీనిపై అప్పట్లో రాజకీయ వివాదం నెలకొంది.

ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ ఖర్చు నెలకు 25 లక్షలు కావడంతో ప్రభుత్వానికి భారంగా మారింది. ఋషికొండ వినియోగంపై అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం లగ్జరీ రిసార్ట్‌గా మార్చడం ఉత్తమమని సూచించింది.

ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానాలు, ఎన్‌జీటీలో పెండింగ్‌లో ఉన్న కేసుల నేపథ్యంలో, ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com