Apple iOS 27లో కొత్త AI ఫీచర్లు - సిరి మరింత స్మార్ట్‌గా మారనుంది
Apple iOS 27 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్‌లో యూజర్లకు ఉపయోగపడే అనేక కొత్త AI ఫీచర్లు పొందుపరచబడ్డాయి.
AI వాల్‌పేపర్ విషయానికి వస్తే, iOS 27లో యూజర్లు వాల్‌పేపర్లను మరింత క్రియేటివ్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చు. Apple Intelligence Image Playground సాయంతో కొత్త వాల్‌పేపర్లను క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న ఫోటోలను కూడా AI తో ఎక్స్‌టెండ్ చేసి పూర్తి లాక్ స్క్రీన్ వాల్‌పేపర్‌గా మార్చుకోవచ్చు.
సిరి విషయంలో పెద్ద మార్పు వస్తోంది. iOS 27లో సిరి AI ఫీచర్లతో సరికొత్తగా రాబోతోంది. స్క్రీన్ పై కనిపించే విషయాలను అది అర్థం చేసుకోగలదు. మీరు చూస్తున్న ఇమేజ్ గురించి అయినా లేదా కెమెరాతో ఫోటో తీసిన వస్తువు గురించి అయినా వివరాలు అడిగితే సిరి విశ్లేషించి సమాధానం ఇస్తుంది. మీ పర్సనల్ కాంటాక్ట్స్‌ను గుర్తుంచుకోగలదు. ఒక యాప్ నుంచి మరో యాప్‌కు సంబంధించిన పనులను కూడా సిరితో ఈజీగా చేయించుకోవచ్చు.
లిక్విడ్ గ్లాస్ డిజైన్ విషయంలో Apple పెద్ద మార్పు తీసుకొస్తోంది. కొత్త అప్‌డేట్‌లో ట్రాన్స్‌పరెన్సీ ఎంత ఉండాలో యూజర్లే నిర్ణయించుకోవచ్చు. కొత్త స్లైడర్ సాయంతో లుక్‌ను తమకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. లాక్ స్క్రీన్, యాప్స్ మెను అన్నీ పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి.
Safari బ్రౌజింగ్ కూడా iOS 27లో మరింత స్మార్ట్‌గా మారనుంది. మీరు ఫాలో అవుతున్న వెబ్ పేజీలను Safari మానిటర్ చేస్తుంది. ఆ పేజ్‌లో ఏదైనా కొత్త అప్‌డేట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ కూడా పంపుతుంది. టాబ్‌లను ఆర్గనైజ్ చేయడంలో కూడా AI సహాయపడుతుంది. డేటా సేఫ్టీ కోసం పూర్తి ప్రాసెస్ డివైస్‌లోనే జరుగుతుందని Apple తెలిపింది.
Apple Intelligence కేవలం సిరికే పరిమితం కాదు. Photos, Messages, Safari, Calendar, Reminders, Shortcuts ఇలా అన్ని యాప్‌లలో పనిచేస్తుంది. దీనితో ఫోటో ఎడిటింగ్, మెసేజ్ మేనేజింగ్, Shortcuts క్రియేషన్ లాంటి పనులను AI తో ఈజీగా చేసుకోవచ్చు. నాచురల్ లాంగ్వేజ్‌లో Shortcuts క్రియేట్ చేసే సదుపాయం ఇందులో మరో హైలైట్‌గా చెప్పొచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com