రాష్ట్ర అప్పులపై భట్టి విక్రమార్క నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అప్పులు, ఆదాయం, వ్యయం, వడ్డీ చెల్లింపులు తదితర అంశాలపై సమగ్ర సమాచారం వెల్లడించనున్నారు.
తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు, తాము అధికారంలో ఉన్నప్పుడు (2014-2023) కేవలం 2.8 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేశామని, అది రాష్ట్ర అభివృద్ధి కోసమే అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులతో కలిపి మొత్తం 8 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని చెబుతోంది. సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయల వడ్డీ భారం ఉందని ప్రభుత్వం ఎత్తిచూపుతోంది.
నిన్న మంత్రి జూపల్లి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య చర్చకు సవాల్ విసురుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో నేటి ప్రెజెంటేషన్ లో వివిధ ప్రభుత్వాల హయాంలో తీసుకున్న రుణాలు, వడ్డీ చెల్లింపులు వంటి గణాంకాలతో ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com