హైటెక్ సిటీలో అర్ధరాత్రి కార్ రేసింగ్: పోలీసులపైకి కారు దూసుకెళ్ళింది, ఒక నిందితుడు అరెస్టు
హైదరాబాద్ హైటెక్ సిటీలోని నిలోఫర్ కేఫ్ పరిసరాల్లో అర్ధరాత్రి 1 గంటకు కొందరు యువకులు ఖరీదైన కార్లతో ప్రమాదకరమైన రేసింగ్ చేశారు. స్థానికుల ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
రోడ్డుపై నిలబడిన పోలీసులను చూసి కూడా ఆగకుండా నిందితులు కారును వారిపైకి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు పక్కకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత పోలీసులు వాహనాలతో వెంబడించి ఒక నిందితుడిని కారుతో సహా పట్టుకున్నారు. మిగిలిన రేసర్లు పరారయ్యారు.
సైబరాబాద్ పోలీసులు పట్టుబడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని CCTV footage జల్లడ పట్టి పరారైన నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం కింద కఠినమైన sections కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో వారాంతపు రాత్రుళ్ళు హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గండిపేట రోడ్లు, Outer Ring Road పై ఇలాంటి రేసింగ్ మామూలుగా మారింది. గతంలో ఇలాంటి ఘటనల్లో పాదాచారులు, బైక్ రైడర్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి. రోడ్లపై రేసింగ్ చేస్తే కార్లు జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com