కడప జిల్లాలో JSW స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన: సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపుర్రాళ్ళపల్లె సమీపంలో JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఈ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, శంకుస్థాపన ఫలకం, బహిరంగ సభా వేదిక, మంత్రుల తాత్కాలిక విశ్రాంతి గదులు, కంపెనీ ఎక్స్పీరియన్స్ జోన్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంత్రి సవిత మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని, జమ్మలమడుగు నియోజకవర్గానికి, రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com