అంతర్జాతీయం బ్రేకింగ్

కాలిఫోర్నియాలో రసాయన ట్యాంక్ లీక్: 40 వేల మంది తరలింపు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కాలిఫోర్నియాలో రసాయన ట్యాంక్ లీక్: 40 వేల మంది తరలింపు
📷 Gu Bra / Pexels
షేర్ కాపీ అయింది ✓

అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా, Orange County లోని Garden Grove నగరంలో ఒక రసాయన ట్యాంక్ లీక్ అవ్వడంతో సుమారు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

GKN Aerospace అనే కంపెనీ plant లో ఈ సంఘటన జరిగింది. ఈ plant లో commercial మరియు military విమాన విడిభాగాలు తయారవుతాయి. plastic విడిభాగాల తయారీకి వాడే మిథైల్ మిథాక్రిలేట్ అనే రసాయనం పెద్ద ట్యాంక్ లో నిల్వ ఉంది. ఇది చాలా వేగంగా మండే స్వభావం గల ప్రమాదకర రసాయనం.

గురువారం ఆ ట్యాంక్ overheeat అవ్వడంతో రసాయనం వాయువు రూపంలో గాలిలోకి విడుదలైంది. ట్యాంక్ లో దాదాపు 22,700 నుంచి 26,500 లీటర్ల రసాయనం ఉంది. అధికారులు లీకేజీని అదుపు చేయలేకపోయారు. శుక్రవారం ఉదయానికి పరిస్థితి మరింత తీవ్రమైంది.

ట్యాంక్ ఏ క్షణమైనా పేలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. Garden Grove తో పాటు చుట్టుపక్కల మరో ఐదు నగరాల ప్రజలను తరలించారు. భద్రతా కారణాల వల్ల స్థానిక పాఠశాలలను కూడా మూసివేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com