హైదరాబాద్ 25°C
అమరావతి 26°C
IST 8:23 AM
శనివారం జూలై 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

గుడివాడ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు: ప్రజావేదిక, విద్యార్థుల సమావేశంలో పాల్గొననున్న సీఎం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గుడివాడ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు: ప్రజావేదిక, విద్యార్థుల సమావేశంలో పాల్గొననున్న సీఎం
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 10 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరే సీఎం 10:20 నిమిషాలకు గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 10:45 నిమిషాలకు ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:55కు కేకేఆర్ గౌతం స్కూల్‌లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గెలవర్తి గ్రౌండ్స్‌లో గుడివాడ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

సీఎం పర్యటన నేపథ్యంలో గుడివాడలో భద్రతా ఏర్పాట్లు పటిష్టపరిచారు. హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, క్యాడర్ సమావేశాల వేదికల వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:05 నిమిషాలకు సీఎం తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com