హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 12:49 PM
సోమవారం ఆగస్టు 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

కానిస్టేబుల్ సుధాకర్ 'మిషన్ 80'లో ప్రపంచ రికార్డు సృష్టించారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కానిస్టేబుల్ సుధాకర్ 'మిషన్ 80'లో ప్రపంచ రికార్డు సృష్టించారు
📷 Aalekh Deval / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ నారాయణగూడా మెల్కోటే పార్కులో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మిషన్ 80’ పేరుతో ప్రపంచ రికార్డు ప్రయత్నం జరిగింది. GVR కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు, కానిస్టేబుల్ సుధాకర్ తన ప్రతిభ చాటారు.

అతనికి 8 నిమిషాల సమయం కేటాయించగా, 3 నిమిషాల 26 సెకన్లలోనే 9 విభిన్న కరాటే బాడీ టెక్నిక్స్‌తో 80 షాబాద్ టైల్స్‌ను బ్రేక్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ప్రయత్నాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ పర్యవేక్షించింది.

సుధాకర్ ఈ విజయాన్ని స్వాతంత్ర సమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తన కరాటే గురువు డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డికి, సిద్దిపేట జిల్లా ఎస్పీ ఆఫ్ ప్రిజన్స్ శ్రీ రత్నంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com