ఆంధ్రప్రదేశ్

MLC అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడి వైద్య పరీక్షలకు కోర్టు ఆదేశం; బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29న తీర్పు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
MLC అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడి వైద్య పరీక్షలకు కోర్టు ఆదేశం; బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29న తీర్పు
📷 khezez | خزاز / Pexels
షేర్ కాపీ అయింది ✓

రాజమహేంద్రవరంలోని కోర్టు MLC అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఆయన ఇంటి నుంచి భోజనం, జైలు సౌకర్యాల కల్పన కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టారు.

కాకినాడ, రాజమహేంద్రవరం ఆసుపత్రుల్లో చేసిన వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. అయితే ఆ నివేదికలో ఈ రెండు ప్రాంతాల్లోనూ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు అందుబాటులో లేరని పేర్కొన్నారు. దీంతో నిపుణుడి వైద్య పరీక్షలు చేయించి నివేదిక ఇవ్వాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇంటి భోజనం సౌకర్యంపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు.

ఇదిలాఉండగా, సాక్షులను బెదిరించిన ఆరోపణలపై నమోదైన కేసుల్లో అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. నిందితుడికి నేర చరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని, బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పని ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు వాదించారు. ఈ బెయిల్ పిటిషన్‌తోపాటు ఇతర సౌకర్యాల కల్పనపై కోర్టు ఈ నెల 29న తీర్పు వెలువరించనుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com