కాకినాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం: బోట్లు రోడ్లపైకి, తీర గ్రామాలు జలమయం
కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ, కుంభాభిషేకం రేవు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రపు నీరు ఇళ్లలోకి చేరడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి.
భారీ అలల ఉద్రృతికి రేవు వద్ద కట్టిన మత్స్యకారుల బోట్లు రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. కొన్ని బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షల రూపాయల విలువైన బోట్లు, వలలు దెబ్బతిన్నాయని మత్స్యకారులు చెప్తున్నారు.
కొన్ని బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. తాళ్లతో కట్టిన బోట్లను కాపాడుకోవడానికి మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. తాళ్లు కట్ చేస్తే తప్ప బోట్లను సురక్షితంగా బయటకు తీసుకురావడం సాధ్యం కాదని వారు చెప్తున్నారు.
కాకినాడ పోర్టు ప్రాంతంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లాలో ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయ్యాయి. తొండంగి, తాళ్లరేవు, కొత్తపల్లి, కందరావుపేట, మూలపేట, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
తీర ప్రాంతంలోని వందలాది గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ స్థాయిలో ఈదురుగాలులు గతంలో ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెప్తున్నారు. రెండు రోజులుగా వేటకు వెళ్లకుండా బోట్లను కట్టేసిన పరిస్థితి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com