తెలంగాణ

మూసి పునర్జీవ ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం; సీఎం రేవంత్ ధన్యవాదాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మూసి పునర్జీవ ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం; సీఎం రేవంత్ ధన్యవాదాలు
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని మూసి నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రక్షణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. 83 ఎకరాల రక్షణ శాఖ భూములను మూసీ ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు అంగీకరించింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని ఈ స్థలం విలువ సుమారు 533 కోట్ల రూపాయలు.

రక్షణ శాఖ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మూసి పునర్జీవ ప్రాజెక్టుకు ఈ భూముల బదలాయింపు కీలక మైలురాయని సీఎం పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com