SIR పై తప్పుడు ప్రచారం చేయవద్దు: కిషన్ రెడ్డి హెచ్చరిక
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన స్టేట్ లీడర్స్ కు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.
28న రంగారెడ్డి జిల్లా BJP కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారు. 29న జిల్లాల వారీగా పార్టీ పనితీరుపై సమీక్షిస్తారు. ఘట్కేసర్ లో ఆఫీస్ బేర్ మీటింగ్ కూడా ఉంటుంది.
బర్కత్ పూర్ BJP కార్యాలయంలో సంఘ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు BJP నేతలు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల పాల్గొన్నారు. BJP నేతల మధ్య సమన్వయం, సోషల్ మీడియా పోస్టింగ్లు, వివాదాల వంటి అంశాలపై చర్చించారు. 2028లో అధికారంలోకి రావడానికి BJP దగ్గరున్న అజెండాపై చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న విధానాలపై RSS అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కృష్ణా నది జలాల విషయంలో కాంగ్రెస్, BRS పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ ప్రూఫ్ కాదని ఆయన స్పష్టం చేశారు. దలై లామాకు భారత పాస్పోర్ట్ ఉన్నా ఆయన భారత పౌరుడు కాదని వివరించారు. మజిలిస్ ఇచ్చిన తప్పుడు సమాచారంతో BJP పై విమర్శలు చేయడం సరికాదని రామచంద్రరావు హెచ్చరించారు.
SIR ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్, BRS చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ CM రేవంత్ SIR కి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్, BRS లు మజిలిస్ పార్టీతో పొత్తు వల్లే పేర్ల తొలగింపుపై నిరసన చేపట్టాలని పిలుపు నిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగనుందని సమాచారం అందుతోంది. రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికి మరో ఇద్దరిని క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్యాబినెట్ బెర్త్ పై తెలంగాణలోని మిగిలిన BJP ఎంపీలు ఆశలు పెట్టుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com