అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో 48 దుకాణాలు దగ్ధం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్‌లో 48 దుకాణాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నిడియాదేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డిఓ సరళావతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ తరపున బాధితులకు రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమైనట్టు తెలుస్తోంది. మంటలకు గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వెరిఫై చేయనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com