హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:39 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

వడదెబ్బ లక్షణాలు, ప్రథమ చికిత్స, నివారణ చర్యలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వడదెబ్బ లక్షణాలు, ప్రథమ చికిత్స, నివారణ చర్యలు
📷 Leandro Paes Leme / Pexels
షేర్ కాపీ అయింది ✓

వేసవిలో వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం కావచ్చు.

వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల వరకు పెరగవచ్చు. చెమటలు పట్టకపోవడం, తలపోటు, వాంతులు, తీవ్రమైన జ్వరం వస్తాయి. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, pulse rate కూడా హెచ్చుతాయి. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవచ్చు.

వడదెబ్బ తగిలిన వెంటనే ఆ వ్యక్తి దుస్తులు తొలగించాలి. చల్లటి గాలి వచ్చే చోట పడుకోబెట్టాలి. తడి బట్ట కప్పాలి. glucose నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగించాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అవసరమైతే fluids ఎక్కించాలి.

వడదెబ్బ నివారించుకోవడానికి కాటన్ దుస్తులు ధరించాలి. తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు మేలు. నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడాలి. వేసవిలో దూర ప్రయాణాలు వీలైనంత మేర తగ్గించుకోవాలి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com