హైదరాబాద్ 23°C
అమరావతి 29°C
IST 1:23 AM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

హైదరాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
📷 Vlada Karpovich / Pexels
షేర్ కాపీ అయింది ✓

గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. ఎల్బి నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు చేరుతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. భీమగల్, వేల్పూర్ మండలాల్లో మోస్తరు వాన పడుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ ఇప్పటికే భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com