తెలంగాణ

కొమరంబీం జిల్లాలో భారీ వర్షాలు: గుండి వాగుపై తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కొమరంబీం జిల్లాలో భారీ వర్షాలు: గుండి వాగుపై తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి
📷 Ieva Brinkmane / Pexels
షేర్ కాపీ అయింది ✓

కొమరంబీం అసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. గుండి వాగుపై నిర్మించిన ఈ రహదారి రాత్రి కుండపోత వర్షానికి ధ్వంసమైంది.

దీంతో గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్థులు అటువైపు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా వంకిడి మీదుగా సుమారు 30 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరవై ఏళ్లుగా తమ గ్రామానికి శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య తీరలేదని గ్రామస్థులు వివరించారు. వెంటనే అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com