అల్లూరి జిల్లాలో షెడ్డుకు కొమ్మకొమ్మకు తేనె పట్టులు — లక్షకు దగ్గరలో ఆదాయం
అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, బూడిద పాకలు గ్రామంలోని ఒక షెడ్డుకు కొమ్మ కొమ్మకు తేనె పట్టులు వచ్చాయి. ఆ షెడ్డులో దాదాపు 15 తేనె పట్టులు ఉన్నాయి.
ప్రతి కొమ్మపై నాలుగైదు తేనె పట్టులు కనిపిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి, వేసవి కాలంలో ఈ తేనె పట్టులను తొలగిస్తారు. తర్వాత మళ్లీ తేనె పట్టులు వస్తాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ తేనె పట్టులను వేలంపాట ద్వారా విక్రయిస్తారు. ఇప్పటివరకు ఈ వేలంపాట ద్వారా గ్రామానికి ₹80,000కు పైగా ఆదాయం వస్తోందని స్థానికులు చెప్పారు.
సాధారణంగా తేనె పట్టులకు దగ్గరగా వెళ్తే తేనె టీగలు కుడతాయని భయపడతారు. కానీ ఈ గ్రామస్తులు ఆ షెడ్డు కింద నిర్భయంగా కూర్చుంటారు. బయటి వ్యక్తులను మాత్రం ఆ షెడ్డు దగ్గరకు రానివ్వరు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com