హైదరాబాద్ 28°C
అమరావతి 31°C
IST 10:49 AM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం, రోడ్లపై నీరు నిలిచి.. అధికారులు అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం, రోడ్లపై నీరు నిలిచి.. అధికారులు అలర్ట్
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. నగరంలోని హైటెక్ సిటీ, టోలిచౌకి, మెహిదీపట్నం, మణికొండ, షేక్పేట్, గచ్చిబోలి, పాతబస్తీ, చార్మినార్, నిజాంపేట్, మియాపూర్, కేపీహెచ్బీ ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దీంతో అనేక రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ సమస్య తలెత్తింది.

పరిస్థితిపై జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, తీగలను తాకవద్దని, మ్యాన్హోల్ మూతలు తెరవవద్దని అధికారులు సూచించారు. షార్ట్ సర్క్యూట్, వాటర్ లాగింగ్ వంటి సమస్యలపై సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఒకేసారి కురిసిన వర్షంతో నగర వాతావరణం చల్లబడింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com