భూకంప ముప్పుపై జపాన్ అత్యవసర హెచ్చరిక.. నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలని సూచన
భూకంప ముప్పు నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. విపత్తుల నిర్వహణ మంత్రి గోషి హుసానో ఈ హెచ్చరికను మీడియా ముందు ప్రకటించారు. ప్రతి పౌరుడు కనీసం ఒక వారానికి సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని ఆయన కోరారు.
తాగునీరు, డ్రై టాయిలెట్ కిట్లను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. భూకంపం వస్తే విద్యుత్ లైన్లు తెగిపోతాయని, నీటి పైపులు పగులుతాయని, గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని ప్రభుత్వం చెప్తోంది. అలాంటి పరిస్థితిలో సూపర్ మార్కెట్లు, దుకాణాలు కూడా త్వరగా ఖాళీ అయిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడే నిత్యావసరాలు భద్రపరుచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
జపాన్లో భూకంపాలు, తుఫాన్లు సాధారణమని ప్రజలు భావిస్తుంటారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి స్వయంగా ప్రజలను హెచ్చరించడం ప్రత్యేకంగా గమనార్హం. పెద్ద భూకంపం (mega earthquake) ముప్పు గురించి శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించినట్టు సమాచారం. భూకంపం ఎప్పుడు వస్తుందనే తేదీని ఎవరూ ప్రకటించలేదు.
ఈ హెచ్చరిక తర్వాత జపాన్ మార్కెట్లలో అత్యవసర వస్తువుల కోసం ప్రజలు పరుగులు తీశారు. దుకాణాల్లో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఇప్పుడే సిద్ధం కాకపోతే విపత్తు తర్వాత ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com