హైదరాబాద్ 24°C
అమరావతి 26°C
IST 1:57 AM
సోమవారం జూలై 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ సార సమర్పణ, ప్రత్యేక పూజలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ సార సమర్పణ, ప్రత్యేక పూజలు
📷 Abhisek Tripathy / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస సారి సమర్పణ మహోత్సవాలు జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి తరపున అమ్మవారికి ఆషాఢ సార సమర్పణ చేశారు.

దేవస్థానం ధర్మకర్తలు, వారి కుటుంబసభ్యులు కొండపైనుండి కళావేదిక నుండి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, చీర, సార సంభారాలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనాయక్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.

అమ్మవారి మూల విరాట్టు దర్శించుకున్న అనంతరం, మహామండపం ఆరవ అంతస్తులో ఉత్సవమూర్తి ముందు సార సంహారాలను నివేదించారు. వేద పండితులు, అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com