హైదరాబాద్ 29°C
అమరావతి 29°C
IST 11:50 AM
గురువారం నవంబర్ 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం.. యముడు యమలోకానికి తాళం వేసే కథ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం.. యముడు యమలోకానికి తాళం వేసే కథ
📷 Prasanjeet Shyam / Pexels
షేర్ కాపీ అయింది ✓

కార్తీక మాసం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ మాసంలోనే భగినీ హస్త భోజనం అనే బాయ్ దూజ్ పండుగ వస్తుంది.

ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అక్క చెల్లెళ్లు అన్నదమ్ములకు హారతి పట్టి, వారు చల్లగా ఉండాలని దీవిస్తారు. అన్నదమ్ములు తమ చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఈ ఆచారం వెనుక యమధర్మరాజు కథ ఉందని చెబుతారు. యముడు తన చెల్లెలు యమునాదేవి ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టింది. సోదరి మీది అనురాగంతో యముడు ఒక వరం కోరుకోమని అడిగాడు. కార్తీక మాసంలో బాయ్ దూజ్ రోజున అక్క లేదా చెల్లెల ఇంటికి వెళ్లి భోజనం చేసే వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని యమునాదేవి కోరుకుంది.

బాయ్ దూజ్ రోజున యముడు యమలోకానికి తాళం వేసి చెల్లెలి ఇంటికి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలంగాణలోని ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి చెల్లెలి ఇంటికి వెళ్తాడని చెప్పే చరిత్రను అర్చకులు గుర్తు చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో అక్క చెల్లెళ్లు ఆర్మీ జవాన్లకు వీర తిలకం దిద్దారు. దుష్టశక్తులపై విజయం సాధించాలని దీవెనలు పెట్టారు. దేశవ్యాప్తంగా అన్న చెల్లెళ్ల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com