విద్య

కావేరి యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యార్థులకు ట్రాక్టర్ మెకానిక్స్ ట్రైనింగ్; 2026 ప్రవేశాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కావేరి యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యార్థులకు ట్రాక్టర్ మెకానిక్స్ ట్రైనింగ్; 2026 ప్రవేశాలు
📷 Esra Afşar / Pexels
షేర్ కాపీ అయింది ✓

కావేరి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ కాలేజీలో ఫామ్ మెషినరీ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో విద్యార్థులకు ట్రాక్టర్ మెకానిక్స్‌పై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.

సీనియర్ ఇన్స్ట్రక్టర్ మారన్ మాట్లాడుతూ, ఇక్కడ విద్యార్థులు ట్రాక్టర్‌ని పూర్తిగా డిస్మాంటిల్ చేయడం, అసెంబ్లింగ్ చేయడం నేర్చుకుంటారు. ట్రాక్టర్ డ్రైవింగ్‌తో పాటు వివిధ ఇంప్లిమెంట్లతో నడపడం, గేర్ సెలక్షన్, రిపేర్లు, మెయింటనెన్స్ చేయడం కూడా నేర్పిస్తామని తెలిపారు.

ఇంజిన్ సెక్షన్‌లో కూలింగ్ సిస్టం, ఏర్ ఇన్టేక్ సిస్టం, లూబ్రికేషన్ సిస్టం వంటి వివిధ సిస్టమ్‌ల గురించి వివరించడంతో పాటు, ట్రాన్స్మిషన్ మరియు హైడ్రాలిక్స్‌పై కట్-సెక్షన్ మోడల్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ఇంజిన్ సమస్యలను సులభంగా గుర్తించగలరన్నారు.

ఈ శిక్షణ వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో మరింత ఆత్మవిశ్వాసం లభిస్తుందని మారన్ చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com