ఖమ్మంలో సోనోవిజన్ షోరూంలో భారీ చోరీ, 60 లక్షల విలువైన ఫోన్లు అపహరణ
ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న సోనో విజన్స్ షోరూంలో ఈ ఉదయం భారీ చోరీ జరిగింది. దుండగులు సుమారు 60 లక్షల రూపాయల విలువైన ఐఫోన్లు, ఇతర ఫోన్లు, చార్జర్లు, అడాప్టర్లు చోరీ చేశారు.
షాప్లోని అలారం మోగడంతో సిబ్బంది అప్రమత్తమై, దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ముందస్తు ప్రణాళికతో వచ్చిన దుండగులు అప్పటికే కారు సిద్ధంగా ఉంచుకొని, వేగంగా పరారయ్యారు.
షాప్ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీలో దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు 60 లక్షల రూపాయలుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పి తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com